కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలబోతారంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొమ్మ శ్రీరాం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో లక్షల్లో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవన్నీ అబద్ధాలని రుజువవుతున్నాయని ఆరోపించారు. నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించిన కాంగ్రెస్ శ్రేణులు - ఎలబోతారంలో కాంగ్రెస్ నేతల పర్యటన
నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొమ్మ శ్రీరాం విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఎలబోతారంలోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
ఇప్పటికైనా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని శ్రీరాం హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలో మాదిరిగా సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుండరాపు శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మునిగంటి సంతోష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాడెపు రాహుల్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'ఒక్క ఇల్లు కూడా కట్టలేదు... జాబితాలో మాత్రం చేర్చారు'