డీజీల్, పెట్రోల్, వంట గ్యాస్‌లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన - karimnagar updates
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం వద్ద పెంచిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని ఆందోళనను విరమింపచేశారు.