కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో అక్రమ లే అవుట్ల వల్ల గ్రామ పంచాయతీ నిధులకు కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు కిరణ్, భరత్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండల పంచాయతీ అధికారికి, కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ లే అవుట్ల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామ పంచాయతీలో అక్రమ లే అవుట్ల అవకతవకలపై గ్రామపంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అక్రమ లే అవుట్ల విధానంపై కలెక్టర్కు ఫిర్యాదు
ఎంపీఓ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు విచారణలో పాల్గొన్నారు. పూర్తి నివేదికను 15 రోజుల్లో జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విచారణలో కొన్ని నిజాలు బయట పడ్డాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఇంజిన్లో మంటలు ఎగిసిపడి బస్సు దగ్ధం