తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిరంతర వైద్యసేవలకు అదనపు సిబ్బందిని నియమిస్తాం'

కరీంనగర్​ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ శశాంక ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కొవిడ్​ రోగులకు అందుతున్న సదపాయాలను వ్యాధి గ్రస్తులను అడిగి తెలుసుకున్నారు.​

collector shashanka visited karimnagar govt hospital
'రోగుల నిరంతర సేవకు అదనపు వైద్యసిబ్బంది నియామకం'

By

Published : Sep 3, 2020, 9:49 AM IST

కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్​ వార్డును కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సదుపాయం గురించి ఆరా తీశారు. పీపీ కిట్ ధరించిన కలెక్టర్ నేరుగా కొవిడ్​ వార్డులోకి వెళ్లి రోగులతో ముచ్చటించారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

నమూనాలు ఇవ్వడానికి వస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా నిర్మిస్తున్న అదనపు షెడ్ పనులను పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 180 పడకలు ఉన్నాయని.. అందులో 25 వెంటిలేటర్లు, 150 ఆక్సిజన్ పడకలు ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల.. కలెక్టర్​కు వివరించారు. వ్యాధిగ్రస్తులకు నిరంతరం సేవలు అందించేందుకు 25 మంది వైద్యులను 99 మంది స్టాఫ్ నర్సులను నియమించడమే కాకుండా పరీక్షలు మరిన్ని పెంచుతున్నట్లు కలెక్టర్ శశాంక వివరించారు.

ఇదీ చూడండి :ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details