తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీఐటీయూ ధర్నా

పెట్రోల్​, డీజిల్​ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని కమాన్​ చౌరస్తా వద్ద సీఐటీయూ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్​ పరిధిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

By

Published : Jun 27, 2020, 12:14 PM IST

CITU Protest Against Petrol, Diesel Rates
పెట్రోల్​, డీజిల్​లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీఐటీయూ ధర్నా

కరీంగనర్​ జిల్లా కేంద్రంలోని కమాన్​ చౌరస్తా వద్ద సీఐటీయూ, ఏఐఆర్​టీడబ్ల్యూఎఫ్​ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్​ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్​ చేశారు. అన్ని రకాల వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం.. పెట్రోల్​, డీజిల్​ను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. కేంద్రం పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ.. ధర్నా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details