ప్రభుత్వ సహకారంతో ప్రజలకు మరింత భద్రతను కల్పించేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వావిలాలపల్లె శ్రీరామ్‌నగర్‌లో నిర్వహించిన నేనుసైతం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ గంట కల్యాణితో కలిసి సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: సీపీ - సీసీ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్న సీపీ కమలాసన్ రెడ్డి
ప్రజలకు భద్రత కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. నగరంలోని వావిలాలపల్లె శ్రీరామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నేను సైతం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.
కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి
శ్రీరామ్‌నగర్ కాలనీవాసులు 30 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మహిళలను వేధించే పోకీరీలను గుర్తించేందుకు సాధారణ దుస్తుల్లో ఉండేలా పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్మార్‌ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరు 'హాక్ ఐ' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సీపీ సూచించారు. సమావేశంలో పోలీసు కళాకారుల బృందం ఆలపించిన జానపద గేయాలు అలరించాయి.