కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఠాణాలో పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు, స్థానిక యువకులు రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ గ్రామీణ ఏసీపీ విజయ సారధి మాట్లాడారు.
చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చొప్పదండి ఠాణాలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు, స్థానిక యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో రక్తదాన శిబిరం
అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు చేశారని ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో శాంతిని పరిరక్షించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. కేటీఆర్‌ను కలిసిన హీరో రామ్ .. రూ.25 లక్షల విరాళం