హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టిన భాజపా... ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించింది. తాజాగా నియోజకవర్గ పరిధిలోని మండలాలకు బాధ్యులను నియమించింది. జమ్మికుంట పట్టణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్, గ్రామీణానికి మాజీ ఎమ్మెల్యే ధర్మారావుకు బాధ్యతలను అప్పగించింది.
హుజూరాబాద్ ఉపఎన్నికపై భాజపా దృష్టి.. గెలుపే లక్ష్యంగా పావులు - కరీంనగర్ జిల్లా తాజా వార్తలుట
హుజూరాబాద్ ఉపఎన్నికపై భాజపా దృష్టి పెట్టింది. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గంలో.... సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించిన కమలం..... తాజాగా మండలాలకు బాధ్యులను నియమించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికపై భాజపా దృష్టి
హుజురాబాద్ టౌన్‌కి ఎమ్మెల్యే రఘునందన్ రావు, రూరల్‌కు రేవూరి ప్రకాశ్ రెడ్డిని ప్రకటించారు. ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి, కమలాపూర్‌కు కూన శ్రీశైలం గౌడ్, వీణవంకకు ఏనుగు రవీందర్ రెడ్డిలకు బాధ్యతలను అప్పగించింది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది.