తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2022, 3:54 PM IST

ETV Bharat / state

Tharun Chug on police: కేసీఆర్​ వర్కర్లుగా రాష్ట్ర పోలీసుల తీరు: తరుణ్​ చుగ్​

Tharun Chug on police: కరీంనగర్​ జైలులో ఉన్న భాజపా నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​ చుగ్​ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని తరుణ్​ చుగ్​ అన్నారు. భాజపా కార్యకర్తలపై పోలీసుల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు నివేదిక ఇస్తామని.. ఈ ఘటనపై తాము గవర్నర్​ను కూడా కలవబోతున్నట్లు చెప్పారు.

tharun chug visited bjp leaders
భాజపా నేతలను పరామర్శించిన తరుణ్​ చుగ్​

Tharun Chug on police: రాష్ట్ర పోలీసులు కేసీఆర్‌ వర్కర్లుగా పనిచేస్తున్నారని... భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జైలులో ఉన్న భాజపా నేతలను పరామర్శించిన తరుణ్‌చుగ్‌... అరెస్టయిన నేతలకు భాజపా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్‌ చేతిలో కీలు బొమ్మలా మారారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. భాజపా నేతల అరెస్టులను ఖండిస్తున్నామన్న ఆయన... అక్రమ కేసులతో పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

హైకోర్టు తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కొవిడ్​ నిబంధనల పేరుతో పోలీసులు బండిసంజయ్​ను ఉగ్రవాదిలా చూశారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న సంజయ్​పై దాడిని ఖండిస్తున్నాం. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. వారంతా కేసీఆర్​ వర్కర్లలా పనిచేస్తున్నారు. ---- తరుణ్​ చుగ్​, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్​

జీవో 317 కు వ్యతిరేకంగా ఈ నెల 3న కరీంనగర్లో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండి సంజయ్​తో పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న.. బండి సంజయ్​ను విడుదల చేశారు. ఈ మేరకు కరీంనగర్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కార్పొరేటర్లు, కార్యకర్తలను.. తరుణ్ చుగ్, భాజపా జనరల్ జాతీయ కార్యదర్శి రాజా సింగ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ ప్రేమేందర్​ రెడ్డి పరామర్శించారు.

కేసీఆర్​ వర్కర్లుగా రాష్ట్ర పోలీసుల తీరు: తరుణ్​ చుగ్​

ఇదీ చదవండి:రామకృష్ణ విడుదల చేసిన వీడియో తీవ్ర క్షోభకు గురిచేసింది: వనమా

ABOUT THE AUTHOR

...view details