70 ఏళ్లుగా రావణకాష్ఠంగా ఉన్న సమస్యను మోదీ, అమిత్‌షా సులభంగా పరిష్కరించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణకు, జమ్ము కశ్మీర్‌కు పోలికలు ఉన్నాయని అన్నారు. నిజాం ఉక్కు పాదం కింద నలిగిన తెలంగాణ గడ్డకు సర్దార్ పటేల్ విముక్తి కలిగించారని వివరించారు. జమ్ము కశ్మీర్ విషయంలో నెహ్రూ అనేక సడలింపులు ఇచ్చి వివాదం చేశారని తెలిపారు. నెహ్రూ చేసిన తప్పు ఇన్నాళ్లు దేశానికి గుదిబండగా మారిందన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను సమర్థించేలా ఉన్నాయన్నారు. భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో కలిసి లక్ష్మణ్ హాజరయ్యారు.
"తెలంగాణకు, జమ్ము కశ్మీర్‌కు పోలికలున్నాయి" - బీజేపీ
తెరాస, కాంగ్రెస్ నాయకుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. భాజపా ఎదుగుదలను ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాయన్నారు.
"తెలంగాణకు, జమ్ము కశ్మీర్‌కు పోలికలున్నాయి"