'మున్సిపాలిటీ ఎన్నికల్లో భాజపాదే విజయం' - muncipal
నగర పాలక, మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల్లో భాజాపా కాషాయం జెండా ఎగుర వేస్తుందని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో భాజపాదే విజయం
యువత ప్రోత్సాహంతోనే బండి సంజయ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకడానికే ప్రజలు భాజపాను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. నగరపాలక సంస్థల ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధే ధ్యేయంగా భాజపా పని చేస్తుందని ఆయన వెల్లడించారు.