తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు ఆరోపించారు. రైతు బంధు పథకం ప్రకటించి 40 రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయకపోవడం వారిని కించపరిచినట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాతల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా.. వెంటనే ఖరీఫ్ సీజన్‌కు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు.
ఖరీఫ్ వరకు రైతుల ఖాతాలో జమ కావాలి - SUGUNAKAR RAO
తెరాస ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తుందని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు మండిపడ్డారు. రైతు బంధు పథకం డబ్బులు ఖరీఫ్ వరకు రైతుల ఖాతాలో జమ కావాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ వరకు రైతుల ఖాతాలో జమ కావాలి
ఇవీ చూడండి: తండ్రి గౌరవం ముందు డబ్బు గడ్డిపరకైంది!