తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో అధికారంలోకి భాజపా' - కేంద్ర మాజీ మంత్రి

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా నిలువనుందని దీనికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కరీంనగర్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు.

'రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో అధికారంలోకి భాజపా'

By

Published : Aug 9, 2019, 11:46 AM IST

Updated : Aug 9, 2019, 2:07 PM IST

కరీంనగర్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత నమోదు భాజపా లక్ష్యమని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీవాసులను పలకరిస్తూ భాజపాలో చేరాలని కోరారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో మూడు లక్షల జనాభా ఉండగా ఇప్పటికే తమ సభ్యత్వ నమోదు లక్షకు చేరిందన్నారు.

తెరాస ప్రభుత్వం వేల కోట్లతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ అన్నారు. కాళేశ్వరం ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పినా ఇప్పటికీ రైతుల పొలాల్లోకి చుక్క నీరు రాలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరు మీద కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆరేళ్ల తెరాస పాలనలో కొత్తగా ఎంత ఆయకట్టుకు నీరు అందించారో తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుందన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో అధికారంలోకి భాజపా'

ఇదీ చూడండి : థర్మకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

Last Updated : Aug 9, 2019, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details