తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు - bjp leaders protest in karimnagar

కరీంనగర్ లో తెరాస వైఖరికి నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు.

అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు

By

Published : Sep 6, 2020, 7:29 PM IST

అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు భాజపా నాయకులు. కరీంనగర్ లో తెరాస వైఖరికి నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కరీంనగర్ లో శనివారం జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఉదంతం ప్రజాస్వామ్య ఉనికికి నిదర్శనమన్నారు.

199 అంశాలకుగాను 33 అంశాలను మాత్రమే చర్చించి మిగతావి చర్చించకుండా సంఖ్యాబలం ఉందనే దృక్పథంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారని విమర్శించారు. మౌన పాత్ర వహించిన కమిషనర్ వైఖరికి నిరసనగా కరీంనగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details