హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుస్తులాపూర్ వద్ద ఆగిఉన్న లారీనీ ఢీ కొట్టగా... 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని భాజపా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ప్రమాద బాధితులకు భాజపా పరామర్శ
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద జరిగిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణరావు పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు లేవని సిటీ స్కాన్ కూడా లేదని ఆయన మండిపడ్డారు.
ఆర్టీసీ ప్రమాద బాధితులకు భాజపా జిల్లా అధ్యక్షుడి పరామర్శ