తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ అవినీతి రహిత పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపాకు కొత్త వైభవం రానుందని... భాజపా పట్ల ప్రజల్లో రోజురోజుకీ విశ్వాసం పెరుగుతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీల నుంచి భాజపాలో చేరిన పలువురు నాయకులకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోంది: కిషన్ రెడ్డి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోంది: కిషన్ రెడ్డి