ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అన్నారు. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణలో తన పేరు ఉంటే మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఈటలకు ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు.
ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధమన్నారు. ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. సానుభూతి కోసం ఈటల నాటకాలు ఆడుతున్నట్లు ఉందని విమర్శించారు. ఈటల తన మీద తానే దాడి చేయించుకునే అవకాశం ఉందన్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని మంత్రి గంగుల తెలిపారు.