వసంత పంచమిని పురస్కరించుకుని కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీమహా శక్తి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు తరలివచ్చారు.
మహాశక్తి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ - bjp telangana state president
కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీమహాశక్తి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే చిన్నారులు విద్యావంతులు అవుతారని తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మహాశక్తి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాశక్తి అమ్మవారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. విద్యావంతులు అవుతారని తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకమని తెలిపారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడినా.. యాజమాన్యాలు మాత్రం పూర్తి ఫీజులు వసూలు చెల్లించాలనడం దుర్మార్గమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంలో ఆలోచించి మసులుకోవాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి :వర్గల్ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి