Bandi Sanjay: కరీంనగర్ ప్రజలు తనను గెలిపించినందుకే పార్టీలో తనకు ఈ గుర్తింపు వచ్చిందని.. కార్యకర్తల త్యాగాలను తాను ఏనాడు మరిచిపోనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకుని కరీంనగర్‌కు మొదటి సారి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు బండి సంజయ్‌ను ఘనంగా సన్మానించారు. ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారంలోకి రావడానికి అక్కడి కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో తెలుసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
Bandi Sanjay: మరో 20 ఏళ్లు ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటారు: బండి సంజయ్ - telangana news
Bandi Sanjay: డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ది సాధ్యమౌతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ప్రజలు తనను గెలిపించినందుకే పార్టీలో తనకు ఈ గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకుని కరీంనగర్‌కు మొదటి సారి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరో 20ఏళ్ల పాటు ప్రధానిగా నరేంద్రమోదీ ఉంటారని ఆయన తెలిపారు.
Bandi Sanjay: మరో 20 ఏళ్లు ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటారు: బండి సంజయ్
ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ప్రజలకు తగిన న్యాయం జరిగిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ది సాధ్యమౌతుందని గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరో 20ఏళ్ల పాటు ప్రధానిగా నరేంద్రమోదీ ఉంటారని.. తెరాస వాళ్లు నియమించుకున్న రాజకీయ వ్యూహకర్త పీకే చెప్పారని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇదీ చదవండి: