రోజూ తన ఆటోలో ప్రయాణిస్తున్న ఎంతో మంది దాహంతో ఇబ్బంది పడటం గమనించాడు ఓ ఆటోవాలా. అలాంటి వారికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆలోచించాడు. తను నడిపే ఆటోలనే మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాడు. 4 నీటి క్యాన్లతో మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
అందరి దాహం తీర్చే ఆటోవాలా - \WATER
మొబైల్ గ్రంథాలయాలు... మొబైల్ హోటళ్లు... మొబైల్ ఆస్పత్రులు... మొబైల్ టాయిలెట్లు... ఇప్పటి వరకు ఇలా ఎన్నెన్నో చూశాం. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దీనికి భిన్నంగా మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
అందరి దాహం తీర్చే ఆటోవాలా
ఓ వైపు ఆటో నడుపుతునే మరోవైపు అదే ఆటోలో మంచినీటి డబ్బాలను పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు కరీంనగర్ జిల్లా నాగుల మల్యాలకు చెందిన బాబు. తన నాయనమ్మ - తాతయ్యల జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. వేసవికాలంలో రోజుకు 20 నుంచి 25 డబ్బాల మంచినీటిని కరీంనగర్ ప్రజలకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇవీ చదవండి: తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?