కరీంనగర్లో అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దయగల నిధి అనే కార్యక్రమాన్ని చేపట్టి పలువురికి సాయం చేశారు. నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులను సేకరించి పేదవారికి అందించారు. దయగల నిధి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని క్లబ్ సభ్యులు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని కోరుతున్నారు.
వృథా చేయకండి.. పది మందికి పంచండి - కరీంనగర్
నిరుపయోగంగా ఉన్న వస్తువులు లేక దుస్తులు చెత్తకుప్పలో వేస్తుంటాం. కానీ వాటిని సేకరించి పేదవారికి సాయం చేస్తోంది అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. కరీంనగర్లో దయగల నిధి అనే కార్యక్రమం చేపట్టి నిరుపయోగంగా ఉన్న వస్తువులు, దుస్తులు బీదవారికి అందించారు.
దుస్తులు అందిస్తూ