తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు - అన్నమయ్య జయంతి వేడుకలు.

అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్​ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య గీతాలాపన ప్రజలను ఆకట్టుకుంది.

అన్నమయ్య జయంతి

By

Published : May 20, 2019, 9:38 AM IST

అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్​లో అన్నమయ్య సహస్ర గళార్చన ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గాయకులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ అలరించారు. పదకవితా పితామహని సంకీర్తనల స్వరాభిషేకం ప్రజలను ఆకట్టుకుంది.

అన్నమయ్య గీతాలాపన చేస్తున్న గాయకులు

ABOUT THE AUTHOR

...view details