Aadhaar Update At E Seva Centers in Karimnagar ఆధార్ అప్‌డేట్ ఇక్కట్లు.. ఈ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్న జనం Aadhaar Update At E Seva Centers in Karimnagar :రేషన్ కార్డుకు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు రేషన్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కానీ చాలామందికి వేలిముద్రలు, చరవాణి నంబర్లు..ఆధార్‌తో అనుసంధానం లేకపోవడంతో ఈకేవైసీ నమోదు కావడం లేదు. విస్తృత ప్రచారం కారణంగా ఎక్కువ మంది ఆధార్ నవీకరణకు ఈ-సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఆధార్ కేంద్రాలను మండలాల్లో ఏర్పాటు చేసినా.. ప్రజలకు అక్కడ సరైన సేవలు అందక జిల్లా కేంద్రం వైపు పరుగులు తీస్తున్నారు. నవీకరణకు గ్రామాల నుంచి నగరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో నగరంలోని ఈ-సేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
How to Check Aadhaar Update History in Online : ఆధార్ అప్డేట్ చేసుకున్నారా.. లేదా..? ఇది చదవాల్సిందే..!
Aadhaar Update Issues in Karimnagar :ఆధార్ అనుసంధానానికి ఆధార్‌కేంద్ర నిర్వాహకులు పరిమితులు ఉన్నాయనడంతో ప్రజలు భారీసంఖ్యలో వచ్చి.. తిరుగుముఖం పడుతున్నారు. ఉదయం అయిదు గంటలకే కేంద్రాల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నా.... నిర్వాహకులు టోకెన్లు జారీ చేస్తూ సమయం కేటాయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. పిల్లలతో వచ్చి రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదనో, సిగ్నల్ లేదనే కారణాలతో నిర్వాహకులు సమయం వృధా చేస‌్తున్నారని చెబుతున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ అప్డేట్ ప్రక్రియ
'' ఆధార్ అప్డేట్ కోసం ఎక్కవ ధరఖాస్తులు తీసుకోవడంతో సర్వర్ డౌన్ అవుతోంది. దీన్ని గమనించి ప్రజలు సహకరించాలి.ఆధార్ అప్డేట్ కుఈ నెల ఆఖరు తేదీ వరకు చేసుకోకుంటే రేషన్ బియ్యం ఆగిపోతాయని ప్రచారం కావడంతో ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు. వాస్తవానికి దీనికి ఎలాంటి గడువు లేదు. కేవలం ఈ సేవా కేంద్రాలే కాకుండా ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నవీకరణ చేయించుకోవచ్చు.''- వేణురెడ్డి, ఈ సేవా కేంద్రం నిర్వాహకుడు
Aadhaar Card Update Centers in Karimnagar : ఆధార్ నవీకరణ కేంద్రాల్లో గంటకు ఆరు దరఖాస్తులను మాత్రమే ఆధార్ నవీకరణ చేసే అవకాశముంది. అంతకంటే ఎక్కువ చేస్తే సర్వర్ డౌన్ అవుతుందని నిర్వాహకులు వాపోతున్నారు. నిబంధనలకు మించి దరఖాస్తులు తీసుకోకపోవడంతో ప్రజలు గొడవకు దిగుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి దీనికి గడువు లేకున్నా విస్తృతంగా ప్రచారం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో ఆధార్ కేంద్రాల వద్దకు వస్తుండటంతో తీవ్ర రద్దీ నెలకొంటోంది.
ఆధార్ నవీకరణకు గడువు లేదని.. కేవలం ఈసేవా కేంద్రాలే కాకుండా ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నవీకరణ చేయించుకోవచ్చని అధికారులు విస్తృత ప్రచారం చేయాల్సిన అవశ్యకత ఉందని స్థానికులు కోరుతున్నారు
Aadhaar Number On Degree Certificate : ఇక డిగ్రీ మార్కుల మెమోపై నో ఆధార్ నంబర్.. UGC కీలక ఆదేశాలు
How To Check Which Phone Numbers are Linked to Your Aadhaar - సిమ్‌కార్డ్ స్కాం.. మీ ఆధార్ కార్డ్‌తో వేరేవాళ్లు మొబైల్ నంబర్ తీసుకున్నారా? చెక్ చేసుకోండిలా..