తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాల రక్షక భవనానికి ప్రత్యేక ప్రదేశం ఎంపిక చేయాలి'

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్​లో జిల్లా పాలనాధికారి కె. శశాంక మహిళ, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాల రక్షక భవన సముదాయానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

A separate area for child protection should be selected
బాల రక్షక భవనానికి ప్రత్యేక ప్రదేశం ఎంపిక చేయాలి

By

Published : Dec 29, 2019, 7:45 PM IST

మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల రక్ష భవన సముదాయానికి ప్రత్యేక ప్రదేశం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్​లోని కలెక్టర్ ఛాంబర్​లో బాల రక్ష భవన సముదాయానికి సంబంధించి మహిళ, శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం బాల రక్ష భవన్​ను కలెక్టరేట్ భవనంలో నిర్వహిస్తున్నందున పలు ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా భవన సముదాయాన్ని ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు వెంటనే చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, స్పెషల్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా సంక్షేమాధికారి శారద, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ సరస్వతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బాల రక్షక భవనానికి ప్రత్యేక ప్రదేశం ఎంపిక చేయాలి

ఇదీ చదవండి:'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details