తెలంగాణ

telangana

ETV Bharat / state

CAR FELL IN WELL: బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం

CAR FELL IN WELL: బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం
CAR FELL IN WELL: బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం

By

Published : Jul 29, 2021, 9:10 PM IST

Updated : Jul 29, 2021, 9:33 PM IST

20:37 July 29

బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం

బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం

   కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం  అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కష్టంగా మారింది. దాదాపు 8 గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. అందులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురైదుగురు ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. 

మృతుడు సూర్యనాయక్​ వాసిగా గుర్తింపు

   కారు డోరు తెరిచి చూడగా వాహనంలో ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడు విశ్రాంత పోలీసు ఉద్యోగి పాపయ్య నాయక్‌గా గుర్తించారు. పాపయ్య భీమదేవరపల్లి మండలం సూర్యనాయక్ తండా వాసిగా గుర్తించారు. పాపయ్య నాయక్‌ హుస్నాబాద్‌ అక్కన్నపేటలో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించి... ఇటీవలే పదవీ విరమణ పొందారు. కరీంనగర్‌ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

8గంటలపాటు శ్రమించిన అధికారులు 

  ఉదయం బావిలో పడిన కారు క్రమంగా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోతున్న కారు దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వ్యవసాయ క్షేత్రానికి పనిమీద వెళ్లిన రైతు.. కారు బావిలో మునిగిపోవడాన్ని గమనించి స్థానికులను పిలిచాడు. చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే కారును వెలికి తీసే ప్రయత్నాలు ప్రారంభించారు. వర్షకాలం కావడంతో బావి నిండా నీరు ఉంది. దాదాపు 60 అడుగుల మేర నీరు ఉండగా.. గజ ఈతగాళ్లు, మూడు క్రేన్‌ల సహాయంతో కారును బయటకి తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 8 గంటలపాటు కారును తీసేందుకు అధికారులు శ్రమించారు. ఎట్టకేలకు కారును బావిలోంచి బయటకు తీశారు. 
 

ఇదీ చదవండి: Car Accident : వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు... వాహనంలో ముగ్గురు!

Last Updated : Jul 29, 2021, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details