తెలంగాణ

telangana

ETV Bharat / state

5 లక్షల విలువైన నిషేదిత గుట్కా పట్టివేత - 5 lakhs worth of banned gutka

బీదర్​ నుంచి తక్కువ ధరకు నిషేదిత గుట్కాలు తెచ్చి... మానకొండూరులో అమ్ముతున్న వ్యక్తిని పక్కసమాచారం మేరకు పోలీసులు పట్టుకున్ననారు.

5 lakhs worth of banned gutka
5 లక్షల విలువైన నిషేదిత గుట్కా పట్టివేత

By

Published : Dec 10, 2019, 11:24 AM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దేవంపల్లి మార్గంలో సుమారు 5 లక్షల విలువైన నిషేదిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానకొండూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఐదు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

5 లక్షల విలువైన నిషేదిత గుట్కా పట్టివేత
మహారాష్ట్రలోని బీదర్ నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేస్తూ... ఎక్కువ లాభాలు అర్జించేందుకు మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పట్టుబడిన వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టగా సుమారు ఐదు లక్షల విలువైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details