మంత్రాలు చేసి అనారోగ్యం పాలు చేసిందన్న అనుమానంతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో కొంతమంది వృద్ధురాలిపై దాడి చేసి.. గాయపరిచారు. రెడ్డిపేట్ గ్రామానికి చెందిన గడ్డమీది వెన్నెల గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. వెన్నెల అనారోగ్యానికి అదే గ్రామానికి చెందిన అరవై ఏళ్ల బాలవ్వనే కారణమని కుటుంబ సభ్యులు అనుమానించారు. బాలవ్వ చేసిన చేతబడి వల్లనే వెన్నెల ఆరోగ్యం పాడైందని.. ఆమె మీద విచక్షణరహితంగా దాడి చేశారు.
మంత్రాల నెపంతో.. మహిళపై దాడి! - కామారెడ్డి న్యూస్
ప్రపంచమంతా సాంకేతికతో దూసుకుపోతుంటే.. కొంతమంది మాత్రం అర్థం లేని మూఢనమ్మకాలతో ఇంకా పాతకాలంలోనే బతుకుతున్నారు. అనారోగ్యం, ఇతర కారణాల వచ్చిన ఇబ్బందులను మంత్రాలు చేసిందన్న అనుమానంతో ఓ వృద్ధురాలిపై దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు చేసుకుంది.
మంత్రాల నెపంతో.. మహిళపై దాడి!
బాలవ్వకు తల మీద తీవ్రమైన గాయమై రక్తస్రావమైంది. అక్కడే ఉన్న బాలవ్వ కొడుకులు, కోడళ్లు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి మీద కూడా దాడి చేశారు. వెన్నెల కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలవ్వను కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలవ్వ ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసులు 15మందిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రేణుకరాజు తెలిపారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'