తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ భూములు లెక్కల్లో లేనందుకే యూరియా కొరత

ప్రభుత్వం పంపిణీ చేసిన యూరియా రైతులకు చాలకపోవడం వల్ల కామారెడ్డి జిల్లాలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో ఎరువులు సరఫరా చేశారు.

By

Published : Aug 23, 2019, 6:50 AM IST

యూరియా కొరతతో ఇబ్బందులకు గురైన రైతులు

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో యూరియా కొరత ఉండటం వల్ల పోలీస్ బందోబస్తుతో పంపిణీ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్​కు గాను మొత్తం సుమారు 5827 మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్​కు గాను సుమారు 3000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఈ సీజన్​లో ఇప్పటి వరకు 3927 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సీజన్​కు సరిపోయే యూరియా కంటే ఎక్కువే వచ్చినప్పటికీ..యూరియా కొరత ఏర్పడింది. వ్యవసాయ అధికారుల అంచనా మేరకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇక్కడి రైతులు అటవీ భూముల్లో వ్యవసాయం చేయడం వల్ల దానికి కావాల్సిన యూరియా అధికారుల లెక్కల్లో లేకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడింది. దీనితో రైతులు ఇబ్బందులపాలయ్యారు.

యూరియా కొరతతో ఇబ్బందులకు గురైన రైతులు
ఇవీ చూడండి : యువ హృదయం.. ఎంత పదిలం..?

ABOUT THE AUTHOR

...view details