కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో 10 రోజుల క్రితం భూవివాదంలో అన్నదమ్ములైన కుచనపల్లి శంకర్ తన సొంత అన్న అయిన కుచనపల్లి రాజయ్యను నరికి చంపాడు. అనంతరం శంకర్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగి పోయాడు.
ఓ వ్యక్తి ఇంటిపై దుండగుల దాడి.. ఇంటికి నిప్పు - ఇల్లును దగ్ధం చేసిన దండగులు
కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేసి.. నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.
ఓ వ్యక్తి ఇంటిపై దుండగుల దాడి.. ఇల్లు దగ్ధం
అయితే ఆదివారం రాత్రి సమయంలో శంకర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి ఇంటికి నిప్పు అంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు