మద్యం మత్తులో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి నిర్వాహకులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో విగ్రహం పాక్షికంగా ధ్వంసం కాగా నిర్వాహకులు నిమజ్జనం నిర్వహించారు.
మద్యం మత్తులో వీరంగం.. వినాయక విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు - కామారెడ్డి జిల్లా వార్తలు
మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వినాయక మండపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీన్ని గమనించిన నిర్వాహకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో స్థానికంగా ఉంటున్న గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి గ్రామంలోని వినాయక మండపం వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో మండపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసానికి పూనుకున్నాడు. అక్కడే ఉన్న నిర్వాహకులు అతన్ని పట్టుకుని చితకబాదారు. దాడిలో విగ్రహం కొంత భాగం విరిగిపోయింది. విరిగిపోయిన విగ్రహం ఉండరాదని పూజారి సూచించగా వెంటనే నిమజ్జనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలోనూ దసరా ఉత్సవాల వేడుకల్లో గంగాధర్ ఇదే విధంగా వీరంగం సృష్టించాడని గ్రామస్థులు తెలిపారు.