ద్విచక్ర వాహనాన్ని నిలిపే విషయంలో జరిగిన గొడవ ఇరువర్గాల మధ్య చంపుకునే వరకు వెళ్లింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో దయాల్‌సింగ్, రణవీర్‌సింగ్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. దారి మధ్యలో వాహనం ఉంచిన ఇమ్రాన్ తీయమని చెప్పగా... ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. కాసేపటి తరువాత రణవీర్‌సింగ్ ఒంటరిగా కనిపించగానే ఇమ్రాన్ కుటుంబ సభ్యులు దాడికి దిగారు.
దీనికి ప్రతీకారంగా రణవీర్ కుటుంబీకులు తల్వార్లతో వచ్చి ప్రతిదాడికి తెగబడ్డారు. పరస్పర దాడుల్లో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రామకృష్ణ... ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు - injury
ద్విచక్ర వాహనాన్ని నిలిపే విషయంలో మాటకు మాట పెరిగి తల్వార్, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇవీ చూడండి: జగిత్యాలలో వాహనాల దొంగల గుట్టు రట్టు