Terrace Fish farming in Kamareddy : రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో ఎక్కడ చూసినా పంటలు పండించే పొలాలు తగ్గిపోతున్నాయి. పండించిన పంటలు రసాయనాలతో సాగు చేస్తుండడంతో ప్రజలు ఇటీవల కాలంలోమిద్దె తోటల వైపు(Terrace Farming) మొగ్గుచూపుతున్నారు. కాబట్టి ఈ మిద్దె తోటల పెంపకం గురించి మీరు వినే ఉంటారు.. కానీ ఈ 'మిద్దె చేపల పెంపకం' గురించి విన్నారా? తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉంటున్న కొందరు మహిళామణులు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనీ, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలనే తపనతో ఈ తరహా కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వారి ఆలోచనే మిద్దె, చేనుల్లో చేపల పెంపకానికి నాంది పలికింది. ఇంతకీ వారికీ ఆ ఆలోచన ఎలా వచ్చింది.. ఈ పెంపకం కార్యాచరణ ఏంటో వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం..
Rooftop Fish Farming in Telangana :సాధారణంగా మనందరికీ చేపల పెంపకం అంటే గుర్తొచ్చేవి... చెరువులే. కానీ కామారెడ్డిజిల్లా స్వశక్తి సంఘాల మహిళలు ‘ముత్యాలనే పెరట్లో పెంచుతున్నప్పుడు(Pearl Farming Telangana).. చేపల్ని ఎందుకు పెంచలేం?’ అనే ఆలోచన చేశారు. మిద్దెలు, పెరళ్లలో చేపలు పెంచుతూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ మహిళామణులు. స్త్రీనిధి రుణాలతో మీనాల పెంపకంచేపడుతూ.. తమ ఇంట మత్స్యసిరులు సృష్టిస్తున్నారు. చేపల పెంపకం గురించి మొదట్లో అధికారులకు చెప్పినప్పుడు అయ్యేపని కాదనుకున్నారు. సాధ్యాసాధ్యాలు వివరించి, రుణం ఇస్తామన్నా.. బెడిసి కొడితే పరిస్థితి ఏంటి? అనేదీ ఆలోచించారు. ఇలా అనేక అనుమానాల మధ్య మొదలైన వీరి 'మిద్దె చేపలసాగు' ప్రయాణం ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది.
Roof Garden: మిద్దెతోట సాగుపై పెరుగుతున్న ఆసక్తి.. శిక్షణ ఇస్తున్న ఉద్యానశాఖ
'గ్రూప్ సమావేశంలో చేలల్లో చేపల సాగు గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. నేనూ ప్రయత్నించాలనుకున్నా. అందరూ చేలల్లో షెడ్లు వేసుకుంటున్నారు. మాకేమో పొలం లేదు. వేరే దారుల గురించి వెతికితే.. చిన్న చిన్న ట్యాంకుల్లో చేపల్ని పెంచే బయోఫ్లాక్ విధానం గురించి తెలిసింది. అధికారులకు చెబితే ఆలోచన బాగుందన్నారు. కానీ సంరక్షణ సవాల్‌తో కూడుకున్న విషయం అన్నారు. నీటి వినియోగం, మార్పిడి అంశాలపై ప్రత్యేక తరగతులు చెప్పారు. పర్యవేక్షణ కాస్త కష్టంగానే ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్తున్నా.' - చందాపురం రేణుక, మిద్దె చేపల పెంపకందారు
యూట్యూబ్ ఇచ్చిన ఆలోచన : 'ఆసక్తి ఉన్నా అనువైన స్థలం లేదు. యూట్యూబ్లో మార్గాలు వెతికా. అప్పుడే ముత్యాలసాగు వీడియో కనిపించింది. ఆ పద్ధతిలో చేపలు పెంచితే? అన్న ఆలోచన వచ్చింది. రేణుకా ఇదే బాటలో వెళ్తున్నట్టు తెలుసుకున్నా. మిద్దెపై ట్యాంకుల నిర్మాణం చేయించా. ఇదేం కొత్త పద్ధతి కాదు. విదేశాల్లో అమలులో ఉన్నదే. అధికారులు ఎప్పటికప్పుడు మా సందేహాలను నివృత్తి చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల వారంతా మా ఆలోచన భేష్ అంటూ ప్రశంసించారు' మిద్దె చేపల పెంపకందారు నీల రాజ్యలక్ష్మి తెలిపారు.
పెట్టుబడి రూ.40 వేలు.. లాభం రూ.2 లక్షలు.. ఇదీ ఆ రైతుల విజయగాథ..