కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో రూ. 55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.
'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది' - agriculture market committee building in kamareddy district
కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా మైలారంలో బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'
ఈ వ్యవసాయ మార్కెట్లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌ను నిర్మిస్తామని పోచారం తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం అత్యధికంగా బాన్సువాడ నుంచే దిగుబడి అవుతుందని వెల్లడించారు.
రాష్ట్ర రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీ విట్టల్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'