తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగండ్ల వాన... నీటిపాలైన ధాన్యం - కామారెడ్డిలో నేల రాలిన మామిడి కాయలు తాజా వార్త

కామారెడ్డి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షం కురిసింది. వాన కారణంగా వరికొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.

sudden rain in kamareddy
వడగండ్ల వాన... నీటిపాలైన ధాన్యం

By

Published : May 9, 2020, 9:51 PM IST

కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీరని నష్టాల్ని తెచ్చిపెట్టింది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రాల వద్ద ఎటుచూసినా నీరు నిలిచిపోయింది.

గంటసేపు ఏకధాటిగా కురిసిన వాన కారణంగా మామిడి తోటలోని కోత దశకు వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడం వల్ల పలు చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

వడగండ్ల వాన... నీటిపాలైన ధాన్యం

ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details