తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. కారణం అదేనా..? - ప్రభుత్వ హస్టళ్లు

Student dies in Hostel: కామారెడ్డి జిల్లా బీర్కూర్​ బీసీ బాలుర వసతి గృహంలో ఐదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు దారి తీస్తోంది. విద్యార్థికి అర్ధరాత్రి వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్​ సిబ్బంది పేర్కొంటుండగా.. తెల్లవారుజామున హాస్టల్​లోకి పాము వచ్చిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థి మరణం పట్ల గందరగోళం నెలకొంది.

Student dies in Kamareddy district
Student dies in Kamareddy district

By

Published : Sep 10, 2022, 10:40 PM IST

Student dies in Hostel: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. నస్రుళ్లబాద్ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. అర్ధరాత్రి వాంతులు అవ్వటంతో ఆస్పత్రికి తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు సాయిరాజ్‌ మృతి చెందాడన్నారు.

వసతి గృహం చుట్టూ మురికి నీరు, గడ్డి ఎక్కువగా ఉండటంతో తరచూ విష సర్పాలు, కీటకాలు వస్తున్నాయని.. వార్డెన్​కు పలుమార్లు ఫిర్యాదు చేసినా అసలు పట్టించుకోలేదని పలువురు విద్యార్థులు ఆరోపించారు. శుక్రవారం హాస్టల్‌లోకి పాము వచ్చిందని.. అందరూ కలిసి చంపేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు సాయిరాజ్​ బంధువులు వసతి గృహానికి చేరుకొని ఆందోళన చేశారు. పాఠశాల సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వార్డెన్​ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు.

విద్యార్థి సాయిరాజ్ మృతిదేహన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా. నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ సందీప్​ను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సస్పెండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details