తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కును వినియోగించుకున్న శాసన సభాపతి - నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓటేశారు.

ఓటు హక్కును వినియోగించుకున్న శాసన సభాపతి
ఓటు హక్కును వినియోగించుకున్న శాసన సభాపతి

By

Published : Oct 9, 2020, 3:24 PM IST

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు ఉన్న అందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'ఆ 14 మంది పీపీఈ కిట్​ ధరించి ఓటు వేశారు'

ABOUT THE AUTHOR

...view details