కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని పోచారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అన్ని వసతులతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తుందని, నియోజకవర్గ పరిదిలోని 110 గ్రామాలలో 5 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన సభాపతి పోచారం
కామారెడ్డి జిల్లా బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 రెండు పడక గదుల ఇళ్లను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 5వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. బాన్సువాడ పట్ఠణంలో మాతా శిశు ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరథ ప్రయత్నమని స్పీకర్ అన్నారు. జులై ఆఖరి నాటికి కొండపోచమ్మ సాగర్ ద్వారా, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయని సభాపతి హామీ ఇచ్చారు. రూ. 17 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నామని.. త్వరలో ఆ పనులు పూర్తవుతాయన్నారు. బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా నుంచి గ్రామంలోకి రూ. 2.25 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు అప్పులు పాలవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని సభాపతి తెలిపారు.
ఇవీ చూడండి: 80 శాతం మొక్కలు బతక్కపోతే చట్టపరమైన చర్యలు: కేటీఆర్