Speaker Pocharam: ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ స్పీకర్ పోచారం జిమ్ బాట పట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మినీ స్టేడియంను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినీ స్టేడియంలోని ఓపెన్ జిమ్‌లో కసరత్తులు చేశారు. స్థానిక యువకులతో కలిసి జిమ్‌లో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం గంట పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని యువకులకు స్పీకర్ సూచించారు. ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, స్థానిక కౌన్సిలర్ హకీమ్, ఇతరులు పాల్గొన్నారు.
Speaker Pocharam: జిమ్‌లో కసరత్తులు చేసిన స్పీకర్ పోచారం - జిమ్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డి
Speaker Pocharam: శాససనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిమ్‌లో కసరత్తులు చేశారు. ఆరోగ్యమే అన్నిటికన్న విలువైందని యువతకు ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మార్నింగ్ వాక్‌లో భాగంగా మినీ స్టేడియంను సందర్శించిన పోచారం... కాసేపు వ్యాయామం చేశారు.
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న స్పీకర్ పోచారం