కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం తడ్కొల్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో ఉంటున్న తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేశారు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇంట్లోంచి బయటకు రాకూడదని తెలిపారు. అత్యవసర సమయాల్లో వచ్చిన వారు మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు.
నిత్యావసర సరుకులు అందజేసిన సభాపతి పోచారం
కామారెడ్డి జిల్లాలోని తడ్కొల్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో ఉంటున్న తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేశారు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.
నియోజకవర్గంలోని తెల్ల రేషన్ కార్డు లేని వారందరికీ ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీఎస్పీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?