కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ధాన్యం, మక్కల కొనుగోలుపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. మద్ధతు ధరతో రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయడం దేశంలోనే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పోచారం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎ. శరత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు, జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
'ఆలస్యమైనా కంగారుపడకండి... ప్రతి గింజ కొంటాం' - స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి వార్తలు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
'ఆలస్యమైనా కంగారుపడకండి... ప్రతి గింజ కొంటాం'