జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్న ప్రదర్శనకు దిగారు. పోతురాజు వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా బస్టాండ్ వద్దకు చేరుకొని మానవహారం నిర్వహించారు. విధుల్లో చేరబోమని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరు విధుల్లో చేరరని తెగేసి చెప్పారు. సమస్యలను పరిష్కరించి ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
గద్వాలలో పోతురాజు వేషధారణతో నిరసన - tsrtc updates
జోగులాంబ గద్వాలలో ఆర్టీసీ కార్మికులు పోతురాజు వేషాధారణతో వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో మానవరం నిర్వహించారు.
పోతురాజు వేషధారణతో నిరసన