కామారెడ్డి జిల్లా రాజంపేట మండల తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఆర్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ విధి నిర్వహణ సమయంలో ఎలుకల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురైన రవికుమార్‌ను హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖను ఇతర శాఖలో విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్న సమయంలో ఈ ఆత్మహత్య యత్నం చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున రెవన్యూ అధికారులు.. ఉద్యోగులు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఈనెల 23న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం 10 గంటల వరకు తరలిరావాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖలో భూదస్త్రాల ప్రక్షాళన నేపథ్యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు రెవెన్యూ ఉద్యోగులు అనుమానిస్తున్నారు.
ఆర్ఐ ఆత్మహత్యాయత్నం.. ఒత్తిడే కారణమా?
భూదస్త్రాల ప్రక్షాళన నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడికి లోనై ఓ రెవెన్యూ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విధి నిర్వహణ సమయంలో ఎలుకల మందు తాగిన కామారెడ్డి జిల్లా రాజంపేట ఆర్ఐ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆర్ఐ ఆత్మహత్యాయత్నం.. ఒత్తిడే కారణమా?