కల్లాల్లో వడ్లు కొనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy on paddy procurement) విమర్శించారు. ప్రస్తుత సీజన్ వడ్లు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాల్సిన కేసీఆర్.. వచ్చే యాసంగిలో పంటను కేంద్ర కొనాలనడం విడ్డూరంగా ఉందన్నారు. 'కల్లాల్లోకి కాంగ్రెస్' కార్యక్రమంలో భాగంగా సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్‌లో రేవంత్ రెడ్డి(Revanth reddy on paddy procurement) పర్యటించారు. వరికుప్పల వద్దకు వెళ్లిన రేవంత్.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉరి తప్పదు
సాగుదారులతో పెట్టుకున్నవారు బాగుడపడినట్లు చరిత్రలో లేదని రేవంత్(Revanth reddy on paddy procurement) దుయ్యబట్టారు. నెలరోజులుగా ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోందని రైతులు రేవంత్‌కు విన్నవించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలవుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతిలో ఉరి తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వరి కుప్పల పైనే పడుకుని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. రైతుల గురించి ఆలోచించకుండా ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిపోతోంది. ప్రతి గింజా నేనే కొంటా అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు. పార్లమెంటులో ప్రధాన మంత్రిని నిలదీసి వరి పంటను కొనేలా చేస్తాం. పంట నీటిపాలై రైతులు దుఃఖంలో ఉన్నారు. రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నాం. వారి సమస్యలను తెలుసుకునేందుకు కల్లాల్లో కాంగ్రెస్ పేరిట పర్యటిస్తున్నాం. -రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు
ఆ డబ్బుతోనైనా కొనాలి