Revanth Reddy Challenge to CM KCR : ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే 24 గంటల్లో విచారణ కోసం లేఖ(Revanth Reddy Vs KCR) రాయాలన్నారు. తాను ఓటు కొంటూ దొరికానని కేసీఆర్ అంటున్నారని.. 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలను కేసీఆర్ కొనలేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్(BC Delaration)ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి విడుదల చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని.. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడడానికి కామారెడ్డి సిద్ధంగా ఉందని తెలిపారు. గత పదేళ్లపాటు గజ్వేల్ వాసులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి భూములపై ఆయన కన్ను పడిందని ఆరోపించారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ కట్టుకున్నారన్నారు.
ప్రచారంలో 'కరెంట్' మంటలు - బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటల తూటాలు
Revanth Reddy Fires on CM KCR : కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు చాటేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని.. చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబం కోసమేనా.. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది అని ఆవేదన చెందారు. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా కామారెడ్డి వైపు చూసేలా.. ఇక్కడ ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని వివరణ ఇచ్చారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి గెలిచే చిన్న వయసులోనే మంత్రి అయ్యారన్నారు.