ఈటీవీ- ఈటీవీ భారత్‌లో "విధి అనసూయ" అనే శీర్షికన అనే ప్రసారమైన కథనానికి స్పందిన లభించింది. ఎడారి దేశంలో బతుకు దారిని వెతుక్కుంటూ వెళ్లి... అరబ్‌షేక్ చేతికి చిక్కిన ఓ మహిళకు విముక్తి లభించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మరావుపేట్ గ్రామానికి చెందిన సుంకరి అనసూయ పొట్టకూటి కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయింది. ఆమె ఇబ్బందిని వార్తా కథనం ద్వారా తెసుకున్నజగిత్యాల జిల్లా వాసి అయిన రాష్ట్ర ఒమన్ ఎన్ఆర్ఐ గ్రూప్ అధ్యక్షుడు నరేందర్ పన్నీర్... బాధితురాలు పని చేస్తున్న షేక్‌తో మాట్లాడి... కావాల్సిన డబ్బులు ఇచ్చి ఇండియాకు పంపారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మహిళకు అరబ్ షేక్ నుంచి విముక్తి - ఈటీవీ భారత్ కథనానికి స్పందన
ఈటీవీ- ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనాలకు లభించిన స్పందనతో ఒక మహిళ.. స్వదేశం చేరుకుంది. అరబ్ షేక్‌ల చేతిలో బంధిగా మారిన బాధితురాలికి విముక్తి లభించింది. తన కష్టాన్ని ప్రసారం చేసి... విముక్తికి కారణమైన ఈటీవీ- ఈటీవీ భారత్‌కు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.
ఈటీవీ- ఈటీవీ భారత్‌కు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. తన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపెట్టటం వల్లే... తమను ఆదుకుంటున్నారని, తనను కష్టాల చెరసాల నుండి విముక్తురాలిని చేశారని తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
తన అక్క ఆరోగ్యం బాగోలేదని... ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని వేడుకుంది. తన ఇల్లు పూరి గుడిసె కావడం వల్ల వర్షానికి ఇంట్లోకి నీళ్లు వస్తాయని... రాత్రులు పడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందని రాత్రులు ఇంటి సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంది. సీఎం కేసీఆర్ దయతలచి తమకు ఇంటిని అందించి... ఏదైనా పని కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని వేడుకుంది.