తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ గాలివాన

ఈదురుగాలులతో కూడిన గాలివాన ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకొరగగా విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం పూట గాలివాన కురవడం వల్ల ప్రజలు ఆహ్లాదంగా సేదతీరారు.

By

Published : Jun 18, 2020, 5:54 PM IST

heavy rain in joint nizamabad district
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ గాలివాన

ఉమ్మడి నిజామాబాద్​లో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్​ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్, జక్రాన్​పల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన గాలి వాన కురవగా ప్రజలు ఆహ్లాదంగా సేదతీరారు. పలు చోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకొరగడం వల్ల విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, రామారెడ్డి, నస్రుల్లాబాద్, సదాశివనగర్, బిచ్కుంద, జుక్కల్, తాడ్వాయి, బీర్కూర్​, లింగంపేట, పిట్లం మండలాల్లో వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాతిపదికన పనులను ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details