తెలంగాణ

telangana

ETV Bharat / state

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల

కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ సాగు కోసం నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 1,464 అడుగులకు గాను.. ప్రస్తుతం 1,461.75 అడుగులకు చేరింది.

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల

By

Published : Aug 15, 2019, 11:39 PM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ సాగుకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, కలెక్టర్ సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,464 అడుగులకు గాను.. ప్రస్తుతం 1,461.75 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుండటం వల్ల సాయంత్రం అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్​ఫ్లో 4,000 క్యూసెక్కులు కాగా.. వరద గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని ఖరీఫ్ సాగు కోసం విడుదల చేశారు.

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details