తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ వాడబోమంటూ ఎమ్మెల్యే ప్రతిజ్ఞ

కామారెడ్డి జిల్లాలోని కళ్యాణి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్లాస్టిక్ వాడబోమని ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్ వాడబోమంటూ ఎమ్మెల్యే ప్రతిజ్ఞ

By

Published : Oct 2, 2019, 1:24 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీ చౌక్ వద్ద ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కళ్యాణి గ్రామంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ప్లాస్టిక్ వాడబోమంటూ ఎమ్మెల్యే ప్రతిజ్ఞ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details