కామారెడ్డి జిల్లా జీవదాన్రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి పెద్దోళ్ల రాజేశ్వర్రావు అనే వ్యక్తి రోడ్డుపక్కనే ఉన్న నాలాలో పడి మృతి చెందాడు. దేవుపల్లి పల్లి గ్రామనికి చెందిన పెద్దోళ్ల రాజేశ్వర్రావు తన కూతురును ఇంటి దగ్గర దింపి వస్తుండగా జీవదాన్ రోడ్.. వాణి బీడీ కంపెనీ వద్ద బైక్ అదుపుతప్పి డ్రైనేజీలో పడి ఉండొచ్చని చుట్టుపక్కల వారు తెలిపారు.
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా జీవదాన్ రోడ్డు వద్ద బైకు అదుపుతప్పి డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. తన కూతురుని ఇంటిదగ్గర దింపి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద మృతిచెందిన వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు, కన్నీరుమున్నీరుగా విలపించారు.