తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలే ముద్దు... - students

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇందుకు భిన్నంగా తమ పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలకే పంపస్తామంటున్నారు బీబీపేట గ్రామంలోని ప్రజలు.

ప్రభుత్వ పాఠశాలే ముద్దు........

By

Published : Jul 2, 2019, 10:34 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడులకు పంపాలంటే భయపడుతున్నారు. కారణం అక్కడ నాణ్యమైన విద్య అందదనే అపోహ వారిని వెంటాడుతోంది. కానీ, కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మాత్రం ఇందుకు అతీతం. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటుకు పంపకుండా ప్రభుత్వ బడికే పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ బడి 1929లో నిజాం కాలంలో ఏర్పాటైంది. ఉపాధ్యాయుల సమష్టి కృషితో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నిరుడు 160 మంది చేరగా, ఈ ఏడాది ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో కలిపి 169 మంది కొత్తగా ప్రవేశం పొందారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 630కి చేరింది. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 120 మంది పాసై, బయటికి వెళ్లడం విశేషం. సీట్లు భర్తీ అయ్యాయని బోర్డు ఏర్పాటు చేసినా, ప్రవేశాల కోసం వస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు పద్మిణి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details